గంట వ్యవధిలోనే పోగొట్టుకున్న నగదును బాధితుడికి అప్పగించిన పోలీసులు

రిపోర్టర్: సునీల్ స్థలం: వైఎస్ఆర్ కడప

వైఎస్ఆర్ కడప జిల్లా నందలూరు పోలీసులు చురుకైన పోలీసింగ్‌కు నిదర్శనంగా నిలిచారు. సీసీ కెమెరాల సహాయంతో బాధితుడు పోగొట్టుకున్న పర్సును కేవలం గంట వ్యవధిలోనే గుర్తించారు. రూ.20,000 నగదుతో సహా ఆ పర్సును సురక్షితంగా బాధితుడికి అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు. పోలీసుల ఈ వేగవంతమైన స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.