తీపి కబురు: సామాన్యుల జేబులపై ప్రభావం చూపే కొత్త నిబంధనలు అమలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

నవంబర్ మొదటి తేదీ నుంచి సామాన్యులు, పన్ను చెల్లింపుదారులు, పెట్టుబడిదారుల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఎల్పీజీ గ్యాస్ ధరలు, జీఎస్టీ నిబంధనలు, మ్యూచువల్ ఫండ్స్, మొబైల్ కాల్స్ తో పాటు పెన్షనర్లకు సంబంధించిన నూతన విధానాలు మారుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ మార్పులు ప్రజల రోజువారీ ఖర్చులు, ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.