ఆరోగ్యానికి హెచ్ఐఐటీ వర్కౌట్లు: వైద్య నిపుణుల కీలక సూచనలు
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
బరువు తగ్గడమంటే కేవలం కొవ్వును కోల్పోవడం కాదని, కండరాల ద్రవ్యరాశిని మరియు దృఢత్వాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమని యశోద హాస్పిటల్స్ ఫిజియోథెరపీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ శ్రీకాంత్ లడ్డిపెర్ల వెల్లడించారు. హెచ్ఐఐటీ వర్కౌట్లు అంతర్గత కొవ్వును కరిగించడంలో సహాయపడతాయని, అయితే గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.