చిత్తూరు మార్గంలో టాటా పవర్ అల్ట్రా ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: చిత్తూరు

దక్షి భారతదేశంలోని రద్దీగా ఉండే బెంగళూరు-చిత్తూరు-తిరుపతి జాతీయ రహదారిపై టాటా పవర్ సంస్థ మొట్టమొదటి రెండువందల నలభై కిలోవాట్ల డీసీ అల్ట్రా-ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. చిత్తూరు సమీపంలోని శ్రీ వర్ష గ్రాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ స్టేషన్ ద్వారా ప్రైవేట్, వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాలకు వేగవంతమైన సేవలు అందుతాయని తెలిపారు. తిరుపతికి వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు రవాణా సమయం ఆదా అవుతుందని వారు స్పష్టం చేశారు.