బెల్లంపల్లిలో మోదీ క్యాంటీన్ వద్ద బీజేపీ కండువాలతో బతుకమ్మ సంబరాలు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని మోదీ క్యాంటీన్ వద్ద బీజేపీ నాయకురాలు నల్లుల సంగీత ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ కండువాలతో ప్రత్యేకంగా బతుకమ్మను రూపొందించి, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. సంప్రదాయ బతుకమ్మలో పార్టీ కండువాలను ఉపయోగించడం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.