యువ టూరిజం పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన కలెక్టర్ శ్రీహర్ష
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ టూరిజం క్లబ్ జిల్లా స్థాయి పోటీల విజేతలకు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.పాఠశాలల విభాగంలో గర్రెపల్లి తెలంగాణ గురుకుల పాఠశాల ప్రథమ స్థానంలో నిలవగా, కమాన్పూర్ జడ్పీహెచ్ఎస్ ద్వితీయ స్థానం సాధించింది. కళాశాలల విభాగంలో గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ప్రతిభ చాటిన విజేతలను కలెక్టర్ తో పాటు పలువురు అధికారులు ప్రత్యేకంగా అభినందించి