పట్టించుకోని అధికారులతో ఎచ్చెర్ల గ్రామ పారిశుద్ధ్యం తీవ్రంగా అస్తవ్యస్తం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎచ్చెర్ల

ఎచ్చెర్ల గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. వీధుల్లో చెత్త పేరుకుపోవడం, డ్రైనేజీలు పూడుకుపోయి మురుగునీరు రోడ్లపైకి వస్తుండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమల బెడద పెరిగి రోగాల బారిన పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు సక్రమంగా రావడం లేదని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.