ఓయూలో జాతీయ సదస్సు: మాదిగ విద్యార్థులు భారీగా తరలిరావాలని పిలుపు
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 6వ తేదీన మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఆమనగల్లు మండల కేంద్రంలో జరిగిన ఎంఆర్పీఎస్ సమావేశంలో జిల్లా ఇంచార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ ఈ సదస్సు వివరాలు వెల్లడించారు. ఈ మహాసభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని కోరారు.