స్థానిక ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ధీమా

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విశాఖపట్నం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి వంద శాతం స్ట్రైక్ రేట్‌తో అఖండ విజయం సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖపట్నంలో ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరగాలని, గెలిచే సత్తా ఉన్న స్థనాలపైనే కేడర్ దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు.