కర్ణాటకలో ఆర్టీసి బస్సు చార్జీల పెంపునకు రంగం సిద్ధం

రిపోర్టర్: కృష్ణ స్థలం: బెంగళూరు

కర్ణాటకలో ఆర్టీసీ బస్సు చార్జీలు ఈనెల 5 నుంచి పెరుగుతాయని రవాణా శాఖ మంత్రి బైరతి సురేశ్ ఆదివారం వెల్లడించారు. డీజిల్ ధరల పెంపు, ఆర్ధిక నష్టాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నష్టాల్ లో కూరుకుపోయిన కార్పొరేషన్లను ఆదుకోవడానికి చార్జీల పెంపు తప్పదని స్పష్టం చేశారు. శక్తి పథకం కారణంగా పురుష ప్రయాణికుల శాతం తగ్గిందని వివరించారు.