నాగోబా ఆలయంలో భక్తిభావంతో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యేలు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. మురళి నాయక్ భూక్య తన సతీమణి ఉమా నాయక్ తో కలిసి కేస్లాపూర్‌లోని ప్రసిద్ధ నాగోబా ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ శాసన సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ వారికి ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికి స్వయంగా ఆలయ దర్శనం చేయించారు. అనంతరం ముగ్గురు నాయకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నాగోబా స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.