వాయుసేన స్పోర్ట్స్ కాంప్లెక్స్ సీలింగ్ కలకలం: రక్షణ మంత్రికి ఏపీ సింగ్ లేఖ

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

న్యూఢిల్లీలో వాయుసేన స్పోర్ట్స్ కాంప్లెక్స్ భూముల సీలింగ్ వ్యవహారంపై పదవీ విరమణకు ముందు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ కు లేఖ రాసినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. సుమారు నలభై ఎకరాల భూమిని వైమానిక దళం ఆధీనంలోనే ఉంచాలని ఆయన కోరారు. ఈ చర్యపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. కేంద్ర ప్రభుత్వం వాయుసేనను అవమానిస్తోందని ఆరోపించారు.