సత్య నికేతన్‌లో ప్రమాదకర భవనం కూల్చివేత ప్రారంభం
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఇటీవల కూలిన భవనానికి ఆనుకుని ఉన్న ప్రమాదకరమైన మరో భవనాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఏడుగురు మృతి చెందిన దుర్ఘటన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఈ కూల్చివేతలు చేపట్టారు. మరోవైపు నెహ్రూ విహార్‌లో భవనాలు వంగుతున్నాయంటూ స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.