ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమృతలూరు

వేమూరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొని ప్రజల నుంచి వినతులు మరియు ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ప్రజలు తమ గ్రామాల్లో నెలకొన్న రెవెన్యూ, తాగునీరు, పింఛన్లు వంటి వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి అర్జీని పరిశీలించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన స్పష్టంగా ఆదేశించారు.