యువత మంచి మార్గంలో నడవాలని పిలుపునిచ్చిన మాదాడి పూర్ణచంద్రరావు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
యువత మంచి మార్గంలో పయనించాలని ప్రముఖ సామాజిక సేవకులు మాదాడి పూర్ణచంద్రరావు కోరారు. జన్నారం మండల కేంద్రంలో భగవద్గీత పుస్తకాలను ఆవిష్కరించిన ఆయన జీవిత సారమే భగవద్గీత అని దానిని ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. యువత స్పష్టమైన జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాధన కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని భగవద్గీత ప్రాముఖ్యతను వివరించారు.