వైద్యుల హెచ్చరిక: మల విసర్జనలో ఈ మార్పులు కనిపిస్తే తీవ్ర ప్రమాదం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
మల విసర్జన సమయంలో మలం పెన్సిల్ వలె సన్నగా వస్తే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్దపేగులో కణితులు ఏర్పడితే ఈ సమస్య తలెత్తుతుందని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ పేర్కొంది. మలంలో రక్తం పడటం లేదా దీర్ఘకాలిక మలబద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ స్పష్టం చేస్తోంది.