రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేశం కోరుతోందంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శ
రిపోర్టర్: అశోక్
స్థలం: సూర్యాపేట
దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలోనే దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో అడ్డదారులు తొక్కుతూ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న కాషాయ పార్టీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, దేశంలో మార్పు తథ్యమని పేర్కొంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.