నలసొపారలో నవరాత్రి వేడుకల తీవ్ర ఘర్షణ: పది మందికి గాయాలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నలసొపార

మహారాష్ట్రలోని నలసొపార తూర్పు ప్రాంతంలో నవరాత్రి వేడుకల సమయంలో రెండు వర్గాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో సుమారు పది మంది గాయపడినట్లు తులింజ్ పోలీసులు వెల్లడించారు. రోడ్డుపై ఇరుకు కారణంగా ద్విచక్ర వాహనదారునికి, టెంపో డ్రైవర్ మధ్య మొదలైన చిన్న వాగ్వాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. కర్రలు, రాళ్లతో జరిగిన ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.