నాగార్జునసాగర్ కాలువకు గండి.. వృథాగా పోతున్న సాగర్ జలాలు
రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి
స్థలం: నాగార్జునసాగర్
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని రాజవరం మేజర్ కాలువకు భారీ గండి పడింది. దీంతో సాగర్ జలాలు పెద్ద ఎత్తున వృథాగా పొలాల్లోకి చేరుతున్నాయి. వరుసగా కాలువలకు గండ్లు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎన్ఎస్పీ అధికారుల నిర్లక్ష్యం వల్లే కాలువలు అధ్వాన్నంగా మారాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో పేరుకుపోయిన కంపచెట్లు, చెత్తాచెదారం తొలగించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని, తక్షణమే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.