ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఆర్థిక వివరాలు తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: భారతదేశం
దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తమ ఆర్థిక, పరిపాలనా వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గత ఐదేళ్ల ఆడిట్ నివేదికలు, ఫీజుల నిర్మాణం, నిధుల వినియోగంపై పూర్తి వివరాలు అందించాలని జస్టిస్ అహసన్ుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎన్వీ అంజరియాలతో కూడిన బెంచ్ ఆదేశించింది. ప్రైవేట్ వర్సిటీలు లాభాపేక్షతో నడిచే వ్యాపార కేంద్రాలుగా మారకూడదని, విద్యారంగ అభివృద్ధి లక్ష్యంగానే పనిచేయాలని సర్వోన్నత తేల్చిచెప్పింది.