హైదరాబాద్‌లో పబ్‌ల దందా: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న వైనం
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని పలు పబ్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని పోలీసులు తెలిపారు. కూకట్‌పల్లిలోని పబ్‌లో వ్యభిచారం నిర్వహిస్తుండగా యువతులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ హనీట్రాప్‌లు, డ్రగ్స్ లావాదేవీలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. నగరంలో పది నెలల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్‌లపై ముప్పైకి పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు స్పష్టం చేశారు.