కాంగ్రెస్ 420 హామీలు నెరవేర్చాలి: బీఆర్ఎస్ డిమాండ్

రిపోర్టర్: p.g. murthy స్థలం: జన్నారం

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్ జన్నారం మండల నాయకులు డిమాండ్ చేశారు. కేటీఆర్ పిలుపు మేరకు మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వారు ఆందోళన చేపట్టారు.

అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని నాయకులు మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ తీరును ఎండగట్టారు.