యాపిల్ పే ద్వారా చెల్లింపుల సేవలు ప్రారంభించిన జొమాటో

రిపోర్టర్: గోపి స్థలం: India

భారత దేశంలో యాపిల్ పే సేవలు అందుబాటులోకి రాగానే, ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మరియు క్విక్ కామర్స్ ప్లాట్ఫాంబ్లింకిట్ తక్షణమే ఆ డిజిటల్ చెల్లింపుల ఆప్షన్ను తమ యాప్లలో జోడించాయని టెక్ టిప్స్టర్ మరియు స్మార్ట్ఫోన్ న్యూస్ నిపుణులు అభిషేక్ యాదవ్ వెల్లడించారు. భారతదేశంలో ఈ నూతన ఫీచర్ ఎప్పుడు రోల్అవుట్ అవుతుందా అని ఈ సంస్థలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినట్లు ఆయన తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతా వేదికగా పేర్కొన్నారు. దీని ద్వారా వినియోగదారులకు మరింత వేగవంతమైన, సులభతరమైన పేమెంట్ అనుభూతి లభిస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.