కావలిని కరవు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని భాజపా డిమాండ్
రిపోర్టర్: సతీష్
స్థలం: కావలి
కావలి నియోజకవర్గాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించి, తీవ్ర వర్షాభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ కావలి డివిజన్ జనతా వారధి ఇన్ఛార్జి బ్రహ్మానందం డిమాండ్ చేశారు. సోమవారం కావలి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో ఏవోకు వినతిపత్రం సమర్పించారు. ఎల్ నినో ప్రభావంతో నియోజకవర్గంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, తాగు, సాగు నీటి ఎద్దడితో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.