తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తిరుపతి
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేశం, రాష్ట్రం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఏపీ అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 2027 తితిదే డైరీలు, క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు.