ఎర్నాకుళంలో జనవరి నాలుగు నుంచి కేరళ స్కూల్ కలోత్సవం

రిపోర్టర్: వెంకట్ స్థలం: Kerala

కేరళలో అత్యంత వైభవంగా జరిగే పాఠశాల విద్యార్థుల కళా ఉత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరి నాలుగు నుంచి ఎనిమిది వరకు ఐదు రోజుల పాటు జరగనున్న కేరళ స్కూల్ కలోత్సవంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పద్నాలుగు వేల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొననున్నారు. ఆసియాలోనే అతిపెద్ద పాఠశాల కళా ఉత్సవంగా పేరుగాంచిన ఈ వేడుకలో మొత్తం రెండు వందల నలభై తొమ్మిది రకాల ఈవెంట్లను నిర్వహించనున్నారు.