విశాఖ నావల్ డాక్యార్డ్ లో ఐఎన్ఎస్ కేసరి నౌకలోకి చేరిన నీరు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నావల్ డాక్యార్డ్ లో భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ కేసరి యుద్ధనౌక ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి మరమ్మతుల అనంతరం సముద్ర ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో నౌక అంతర్గత భాగంలోకి నీరు చేరడంతో కలకలం రేగింది. సాంకేతిక లోపం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన నావికాదళ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి, పంపుల ద్వారా నీటిని బయటకు తోడేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు నౌకాదళం ఆదేశించింది.