విదేశీ నిధులు మత మార్పిడి కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఢిల్లీ

విదేశాల నుంచి వస్తున్న నిధులను మత మార్పిడి కార్యక్రమాలకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు విరివిగా వినియోగిస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి సురేంద్ర జైన్ ఢిల్లీలో తీవ్ర ఆరోపణలు చేశారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న ఇలాంటి నిధుల ప్రవాహంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.