నెల్లూరు ఐటీడీఏను షెడ్యూల్ జాబితాలో చేర్చాలని సోమిరెడ్డి విజ్ఞప్తి
రిపోర్టర్: మహేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు ఐటీడీఏను షెడ్యూల్ జాబితాలోకి చేర్చి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారులను కోరారు. నెల్లూరులో జరిగిన ఐటీడీఏ 11వ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధి కోసం రూ.750 కోట్ల నిధులు మంజూరు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఐటీడీఏ ఛైర్‌పర్సన్ సదా భార్గవి తదితరులు పాల్గొన్నారు.