హాలియాలో బీఆర్ఎస్ రాస్తారోకో: మున్సిపల్ కమిషనర్ అక్రమాలపై నోముల భగత్ ఫైర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: సూర్యాపేట

హాలియా మున్సిపల్ కమిషనర్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని, ఇండ్లు ఉన్న వారికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నాల్గవ వార్డుకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.