శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ప్రధాని నరేంద్ర మోదీ
రిపోర్టర్: కిరణ్
స్థలం: Pune
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా ఆరా తీశారని ఆయన సన్నిహితుడు విఠల్ మనియార్ పూణేలో తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పవార్ తో ప్రధాని మోదీ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని నడిపించేందుకు సుప్రియా సూలే సిద్ధంగా ఉన్నారని, మీరు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని మోదీ కోరారని వెల్లడించారు. ఈ సంభాషణపై ఇరువర్గాల నుంచి అధికారిక ధ్రువీకరణ రాలేదు.