సోషల్ మీడియాలో తీవ్ర చర్చ: నలభై రెండేళ్ల వయసులో ఇరవై ఎనిమిదేళ్ల యువతి కావాలంటూ ఇంజనీర్ డిమాండ్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
ఆరోగ్యకరమైన పిల్లల కోసం నలభై రెండేళ్ల వయసులో ఇరవై ఎనిమిదేళ్ల యువతిని పెళ్లి చేసుకోవాలని కోరిన వ్యక్తి ఉదంతంపై ప్రముఖ వివాహ వేదిక నిర్వాహకురాలు ఒకరు సోషల్ మీడియా వేదికగా విస్మయం వ్యక్తం చేశారు. పురుషుల వయసు పునరుత్పత్తిపై ప్రభావం చూపదని ఆ వ్యక్తి వాదించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై అంతర్జాలంలో తీవ్ర చర్చ జరుగుతోందని, పురుషుల సంతానోత్పత్తి వయసుపైనా వైద్య నిపుణులు దృష్టి సారించాలని నెటిజన్లు కోరుతున్నారు.