భారత సైన్యం కోసం డ్రోన్ తయారీకి రూ.3.5 కోట్ల గ్రాంట్ సాధించిన సర్వేష్
రిపోర్టర్: వెంకట్
స్థలం: హమీర్‌పూర్
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన డిప్లొమా విద్యార్థి సర్వేష్ శర్మ అసాధారణ ప్రతిభ కనబరిచారు. భారత సైన్యం సరిహద్దు నిఘా కోసం ప్రత్యేకమైన దేశీయ రుద్ర ఎడ్జ్ డ్రోన్ తయారీకి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ.3.5 కోట్ల భారీ గ్రాంట్‌ను సాధించారు. హమీర్‌పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఐదవ సెమిస్టర్ చదువుతున్న సర్వేష్ శర్మ సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఈ అరుదైన ఘనత సాధించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.