అవమానాలే విజయానికి తొలి మెట్లంటూ విద్యార్థులకు మంత్రి పయ్యావుల కేశవ్ దిశానిర్దేశం
రిపోర్టర్: శివ
స్థలం: అనంతపురం
విద్యార్థులు ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలన్న బలమైన తపన కలిగి ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. ఉరవకొండ పర్యటనలో భాగంగా ఆయన స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బీకాం మొదటి సంవత్సరం తరగతి గదిలోకి వెళ్లి కొంతసేపు అధ్యాపకుడిగా మారి విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు నిజ జీవిత పాఠాలను బోధించారు. విద్యార్థులకు మొదటిసారి ఎదురయ్యే అవమానమే భవిష్యత్తులో గొప్ప విజయాన్ని చేకూర్చగలదని ఆయన అభిప్రాయపడ్డారు.