కరీంనగర్ జిల్లాలో కలకలం: నేషనల్ హైవే మట్టి అక్రమ రవాణా గుట్టురట్టు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Karimnagar
కరీంనగర్ మండలం ఇరుకుల్ల వాగు వద్ద నేషనల్ హైవే నిర్మాణ మట్టిని ప్రైవేటు వ్యక్తుల ప్లాట్లకు అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం తీవ్ర కలకలం రేపిందిని తహసీల్దార్ నర్సింగరావు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణానికి వేసిన మట్టిరోడ్డును ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ నాయకులు లారీలతో మట్టిని సొంత భూముల్లోకి తరలిస్తుండటంతో స్థానికులు, కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు, అక్రమ రవాణాను వెంటనే అడ్డుకుని తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించారు.