రాహుల్ గాంధీ మార్చ్‌కు మద్దతు: భయపడే ప్రసక్తే లేదన్న మంత్రి పొంగులేటి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఖమ్మం
రాజ్యాంగ హక్కులపై దాడి జరుగుతున్న తరుణంలో నిలదీయడమే కర్తవ్యమని పొంగులేటి శ్రీనివాస రెడ్డి - మంత్రి, పాలేరు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అధికార బలంతో నిజాలను అణచివేయలేరని ఆయన పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన మార్చ్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. భయపెట్టి దేశ ఆత్మను లొంగదీసుకోలేమని, న్యాయం కోసం యువతతో కలిసి అడుగులు వేస్తామని ఆయన స్పష్టం చేశారు.