విజయనగరం రాజీవ్ స్టేడియంలో ఉత్సాహంగా టగ్ ఆఫ్ వార్
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
విజయనగరం రోటరీ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో నవతారోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాజీవ్ స్టేడియంలో టగ్ ఆఫ్ వార్ పోటీలను ఘనంగా నిర్వహించినట్లు చైర్మన్ ముకేశ్ మారుతీరాజే తెలిపారు.
ఈ పోటీల్లో బాయ్స్, గర్ల్స్ కేటగిరీల్లో జూనియర్స్, సీనియర్స్ విభాగాల నుంచి మొత్తం 297 మంది విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. కార్యక్రమంలో డైరెక్టర్ తేజ, ప్రెసిడెంట్ జగదీష్ బాబు, చందు, మనోజ్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.