ఎఫ్‌ఎంజిఇ అక్టోబర్ 2026 పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: India

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఎఫ్‌ఎంజిఇ అక్టోబర్ 2026 పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానించింది. సెప్టెంబర్ 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు సెప్టెంబర్ 25లోగా దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 31న ఈ పరీక్ష నిర్వహించబడుతుండగా, నవంబర్ 30 నాటికి ఫలితాలు విడుదల కానున్నాయి.