ముగ్దూంపురం తండాలో యూరియాతో సారా దందాపై గ్రామస్థుల ఆందోళన

రిపోర్టర్: Rajashekar స్థలం: నర్సంపేట

నర్సంపేట మున్సిపాలిటీ 12వ వార్డు ముగ్దూంపురం తండాలో ఇష్టానుసారంగా సారా దందా సాగుతోంది. రాష్ట్రంలో సారా బెల్లం దొరకకపోవడంతో పొలాల్లో వేసే యూరియాతో సారా తయారు చేస్తున్నారు. ఈ సారా తాగి మద్యానికి బానిసలైన వారు రోగాల బారిన పడుతున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఈ అరాచకాన్ని వెంటనే అరికట్టాలని గ్రామవాసులు కోరుతున్నారు.