ఆస్ట్రేలియాలో భారీ బంగారం నిక్షేపం: లభించిన భారీ గడ్డ విలువ లక్షన్నర డాలర్లు
రిపోర్టర్: సునీల్
స్థలం: New South Wales
ఆస్ట్రేలియా దేశంలోని న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో ఒక ఔత్సాహిక అన్వేషకుడికి భారీగా బంగారం లభించినట్లు ఏబీసీ న్యూస్ తెలిపింది. మౌంట్ స్టూవర్ట్ స్టేషన్లో త్రవ్వకాలు జరుపుతుండగా సుమారు ఒకటిన్నర కిలోల బరువున్న బంగారు గడ్డ దొరికిందని, దీని మార్కెట్ విలువ లక్షా యాభై వేల డాలర్ల పైమాటేనని ఆయన వెల్లడించారు. ఈ అరుదైన బంగారు ఖనిజం సుమారు తొమ్మిది వందల నలభై గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని కలిగి ఉందని నిపుణులు తెలిపారు.