'రెడ్ బుక్ గవర్నెన్స్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు': కూటమి సర్కార్‌పై వైఎస్ జగన్ ఫైర్

రిపోర్టర్: శివ స్థలం: ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ పోలీసు యంత్రాంగం రెడ్ బుక్ గవర్నెన్స్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. అమెరికా ఎఫ్‌బీఐ పేరుతో ఎక్స్ సంస్థను తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. పోలీసులను రాజకీయ సెన్సార్‌షిప్ ఆయుధంగా మార్చి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, విమర్శలను పారదర్శకతతో ఎదుర్కోవాలని హితవు పలికారు.