'టీచర్లను వైన్ షాపులకు కాపలాగా పెట్టాడు': వైఎస్ జగన్‌పై టీడీపీ ఫైర్

రిపోర్టర్: సునీల్ స్థలం: Amaravati

గురువులంటే వైఎస్ జగన్‌కు గౌరవం లేదని, అందుకే అధికారంలో ఉన్నప్పుడు టీచర్లను వైన్ షాపులకు కాపలాగా పెట్టారని టీడీపీ తీవ్రంగా మండిపడింది. సమాజంలో దైవంతో సమానంగా గౌరవించే ఉపాధ్యాయులను జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారని, ఆయనకు గురువుల పట్ల ఎలాంటి నమ్మకం లేదని టీడీపీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటు విమర్శలు గుప్పించింది.