నూజివీడులో నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ: మంత్రి పార్థసారథి కీలక ప్రకటన

రిపోర్టర్: మహేష్ స్థలం: ఏలూరు

నూజివీడు నియోజకవర్గంలో 217 మంది నిరుపేదలకు కోటి ఐదు లక్షలకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసినట్లు గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 2,307 మందికి 18.61 కోట్ల రూపాయల ఆర్థిక భరోసా కల్పించినట్లు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.