తెలంగాణలో కొత్త డిజిటల్ సేవలు ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
రిపోర్టర్: సునీల్
స్థలం: Telangana
పోలీస్ శాఖలో పారదర్శకతను పెంచేందుకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సీఐడీ విభాగానికి సంబంధించిన పలు డిజిటల్ సేవలను ప్రారంభించినట్లు తెలంగాణ పోలీస్ వెల్లడించారు. రిసెప్షన్ సేవలు పొందిన వారు, ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకున్న వారు, పాస్పోర్ట్ వెరిఫికేషన్ పూర్తయిన వారు మరియు స్పాట్ ఈ-చలాన్లు పొందిన పౌరుల నుంచి ఆన్లైన్ ద్వారా ఫీడ్బ్యాక్ సేకరించే నూతన వ్యవస్థను అమల్లోకి తెచ్చామని, దీని ద్వారా పోలీస్ సేవల నాణ్యత మరింత మెరుగవుతుందని వారు స్పష్టం చేశారు.