కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఉద్రిక్తత నిరసన

రిపోర్టర్: వెంకట్ స్థలం: సిద్దిపేట

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నర్సారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఫామ్‌హౌస్ వైపు దూసుకెళ్లి డప్పుల మోతతో నిరసన తెలిపారు. బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ తోపులాటలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.