పాలకొండ ఎన్నికల ఫలితాల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ మున్సిపల్ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం ఇరవై ఎనిమిది కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేసి, నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రతి రౌండ్ లో ఏడు టేబుళ్ల చొప్పున లెక్కింపు చేపట్టనున్నారు. నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయిన అనంతరం అభ్యర్థుల ఓట్ల వివరాలను ప్రకటించి విజేతలను వెల్లడించనున్నారు.