ఏపీ ఇంటర్ బోర్డు ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు

రిపోర్టర్: మహేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బంది పదవీ విరమణ వయోపరిమితిని 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో జరిగిన 78వ పాలకవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ పరీక్షల మూల్యాంకన పారితోషికాన్ని 25 శాతం పెంచడంతో పాటు, 1978 నుంచి జారీ చేసిన సర్టిఫికెట్లను బ్లాక్‌చైన్ టెక్నాలజీతో డిజిటలైజ్ చేయాలని, విద్యార్థులకు జవాబు పత్రాల విధానంలో మార్పులు చేయాలని బోర్డు నిర్ణయించింది.