పోగొట్టుకున్న బంగారం నగదు బాధితుడికి అప్పగించిన రాజాం పోలీసులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: మన్యం జిల్లా
విశాఖ నుంచి పాలకొండ వెళ్తుండగా బస్సులో పోగొట్టుకున్న బంగారం, నగదుతో కూడిన బ్యాగును రాజాం పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా రికవరీ చేశారు. మన్యం జిల్లా పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన గిరడ సుధాకర్ ఈ నెల 12న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా బ్యాగును పోగొట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు స్పందించిన రాజాం సీఐ డి.నవీన్‌కుమార్ ఆధ్వర్యంలోని పోలీసులు సాంకేతికతను ఉపయోగించి బ్యాగును స్వాధీనం చేసుకుని మంగళవారం స్టేషన్‌లో బాధితుడికి అప్పగించారు.