రాజ్యాంగ వ్యవస్థల మద్దతుపై వైకాపా అధినేత జగన్కు మహువా మొయిత్రా చురకలు

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్న వారికి మద్దతు ఇవ్వటం ఆపి ఆ తర్వాత మాట్లాడండి అంటూ వైకాపా అధినేత జగన్కు పశ్చిమబెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా చురకలు అంటించారు. ఎన్నికల సంఘంపై జగన్ చేసిన ట్వీట్కు స్పందించిన ఆమె, ముందు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం ఆపాలని హితవు పలికారు. రాబోయే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మీ పార్టీ ఎంపీలు మద్దతు ఇవ్వకుండా చూడాలని ఆమె సూచించారు.