తుమ్మిడిహెట్టి పేరుతో సీఎం రేవంత్ డ్రామాలు: బాల్క సుమన్ ధ్వజం

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో వర్షాభావం వల్ల కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నేత బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదని, పూర్తిగా సర్కార్ సృష్టించిన కరవు అని మండిపడ్డారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి తుమ్మిడిహెట్టి పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపారని ఆయన ధ్వజమెత్తారు.